అర్హులందరికీ పక్కా ఇళ్లు, కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌

  • 6 years ago
Andhra Pradesh cabinet meet held on Tuesday. key decisions were taken on this meeting.

మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణానికి ప్రధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం రూ.500 కోట్లతో ప్రైవేటు భూముల కొనుగోలు చేయనున్నారు. .
ఇక అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారానికి సీఎస్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది. కాకినాడ తొండంగి దగ్గర పోర్ట్‌, తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్-2 అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కమ్యూనికేషన్‌ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు ఓకే చెప్పారు.
ఉచిత ఇసుకపై తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక రీచ్‌లను స్వాధీనం చేసుకొని... మహిళా సంఘాలకు అప్పగించాలని భావిస్తోంది. అలాగే కొత్తగా లక్షమందికి పెన్షన్లు మంజూరు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

Recommended