పాన్‌షాప్ యజమాని పై యువతీ ఫిర్యాదు
  • 6 years ago
పాన్‌షాప్ యజమాని ఉపేందర్, అతని టెక్కీ బాధితురాలి కేసులో మరో ట్విస్ట్. ఉపేందర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన జీవితాన్ని నాశనం చేశాడని మహిళా సాఫ్టువేర్ ఇంజినీరి ఇటీవలే కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసింది.
అయితే బాధితురాలు బ్లాక్ మెయిల్ చేస్తోందని, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తోందని ఉపేందర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ మేరకు ఉపేందర్ భార్య ప్రీతి బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఉపేందర్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సదరు యువతి కేవలం డబ్బుల కోసమే తన భర్తపై ఫిర్యాదు చేసిందని ఉపేందర్ భార్య ఆరోపిస్తోంది. ఆమెకు ఇదివరకే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని కొన్ని ఫోటోలను బయట పెట్టింది. కొద్దికాలం అతడితో గడిపిన తర్వాత కట్టుకధ అల్లి తమ నుంచి డబ్బులు తీసుకోడానికి పథకం వేసిందని తెలిపింది. తమ నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేసిందని బోయిన్‌పల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు తమ ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగిన సీసీ టీవీ ఫుటేజ్‌ని ఇప్పటికే పోలీసులకు అందించామని వివరించారు. తన ఇంటికి వచ్చి భర్తకు విడాకులు ఇవ్వాలని బెదిరించిందని చెప్పింది.
ఇదిలా ఉండగా, ఉపేందర్ భార్య ఫిర్యాదుపై బాధితురాలు కూడా స్పందించింది. ఆమె హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్‌ను ఆశ్రయించింది. ఉపేందర్‌తో పరిచయానికి ముందు తన క్లాస్‌మెట్‌తో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం ఉపేంద్రకు ముందే తెలుసునని చెప్పింది. తనను ప్రేమించిన తర్వాత అతనిని పిలిచి సెటిల్మెంట్ చేశాడని తెలిపింది.
Recommended