Naa Nuvve Movie Twitter Review

  • 6 years ago
Kalyan Ram's Naa Nuvve movie twitter review. US premier shows are completed.

కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు జయేంద్ర ఈ రొమాంటిక్ చిత్రాన్ని తెరక్కించారు. అందాల తార తమన్నా, కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. వరుస పరాజయాలతో ఉన్న కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఈ చిత్రం చాలా కీలకం అని చెప్పొచ్చు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంపై యువతలో మంచి అంచనాలే ఉన్నాయి. దర్శకుడు జయేంద్ర గతంలో తెరకెక్కించిన 180 చిత్రానికి మంచి గుర్తింపు వచ్చింది. యుఎస్ లో నా నువ్వే చిత్ర ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు చిత్రం గురించి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఈ చిత్రం నా సహనానికి పరీక్ష పెడుతోంది. సినిమా ప్రారంభమై ఒక గంట గడిచింది. ఇంత వరకు ఆసక్తికర సన్నివేశం ఒక్కటి కూడా రాలేదు.
ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ లా ఉంది. ప్రేమలేదు, కెమిస్ట్రీ కూడా లేదు.
బోరింగ్ లవ్ స్టోరీ.. ఈ సినిమాతో పోల్చితే 180 చిత్రం బాహుబలిలా ఉంటుంది.
చిత్రం కూల్ గా ఉంది. నిజాయతీతో కూడుకున్న కథతో చిత్రాన్నితెరకెక్కించారు.
చిత్రంలో కెమెరామెన్ పిసి శ్రీరామ్ పనితనం అద్భుతంగా ఉంది. విజువల్స్ అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాయి.

Recommended