జగన్ పాదయాత్ర ఆపాలని పోలీసుల ప్లాన్ విఫలం

  • 6 years ago
East Godavari: Police approved the travel through the bridge and the arrangements are being planned for YS Jagan’s entry into East Godavari district on June 12.
#YSJagan

జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించే సందర్భంగా ముఖ ద్వారం వంటి రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై ఆయన పాదయాత్రకు నో చెప్పిన పోలీసులు ఎట్టకేలకు తమ పట్టు సడలించారు. అదే బ్రిడ్జి గుండా జగన్ పాదయాత్రకు ఒకే అనేశారు.
తూర్పుగోదావరి జిల్లా లోకి...రాజమహేంద్రవరంలోకి ప్రవేశించాలంటే నగరం ఆరంభంలో ఉన్న చారిత్రాత్మక వారధి మీదుగా వెళ్లే దారే ప్రధాన మార్గం. అయితే ఆ వంతెన పాద యాత్ర సందర్భంగా తరలివచ్చే జన శ్రేణులను తట్టుకోలేదని, మరో దారి చూసుకోవాలంటూ తూర్పు గోదావరి అర్బన్ జిల్లా పోలీసులు రాజమండ్రి వైసిపి కో ఆర్డినేటర్ రౌతు సూర్య ప్రకాష్ రావు కి పోలీసులు నోటిసులు ఇచ్చారు. జగన్ పాదయాత్రకు ఆ మార్గమే అనువైనదిగా భావించిన వైసిపి నేతలు పోలీసుల నోటీసులకు ధీటుగా స్పందించారు.
పోలీసులు ఏ సందేహాలైతే లేవనెత్తారో వాటికి వైసిపి నేతలు లాజికల్ గా జవాబులిచ్చారు. నిత్యం ఈ వారధి మీదుగా హౌరా - చెన్నై నడుమ 75 ఎక్స్ ప్రెస్ రైళ్లు... అలాగే సుమారు 60 నుంచి 70 వరకు గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తున్న బ్రిడ్జి తమ పాదయాత్రకు ఏ విధంగా అనుకూలం కాదో మీరే సమాధానం చెప్పాలని పోలీస్ వర్గాలను వైసిపి నేతలు ప్రశ్నించారు. వైసిపి నేతలు అడిగిన పాయింట్ లాజికల్ గానే ఉండటంతో దీనిపై కన్విన్స్ అయిన పోలీసులు జగన్ పాదయాత్ర కు అదే దారిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాగే కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ లో బహిరంగ సభకు కూడా పోలీసులు ముందు నో చెప్పగా ధానిపై కూడా వైసిపి నేతలు పోలీసుల అనుమానాలకు తగు సమాధానాలు ఇవ్వడంతో అక్కడ జగన్ సభకు కూడా పోలీసులు ఒకే అనేశారు.

Recommended