ఫుల్ ఛీటింగ్, ఏలూరు లో మోసగాడి అరెస్ట్

  • 6 years ago
వీడో వెరైటీ ఛీటర్...అచ్చంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడమే కాదు వారిని అన్ని విధాలా దోచుకుంటున్నాడు. ఇతడు మోసగించేతీరు పోలీసుల్ని సైతం విస్మయపరిచిందంటే వీడెంతటి కేటుగాడో అర్ధం చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకుంటాడు...ఆ తర్వాత వాట్సప్‌ ద్వారా లవ్ ఛాటింగ్ చేస్తాడు...ఆపైన వారికి మరింత దగ్గరై వారితో సన్నిహితంగా మెలుగుతూ ఫోటోలు...వీడియోలు తీసుకుంటాడు. ఇక ఆ తరువాత అసలు స్వరూపం చూపిస్తాడు. తాను అడిగినట్లు డబ్బు, నగలు ఇవ్వకపోతే మీ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇలా వీడిబారిన పడి మోసపోయిన వారు ఎంతో మంది. అయితేనేం ఎట్టకేలకు ఏలూరు పోలీసులకు దొరికిపోయాడు. వివరాలు...
ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం...ఏలూరు దక్షిణపు వీధికి చెందిన చిన్నపల్లి ముఖేష్‌ సాయి(22) డిగ్రీ చదివి బలాదూర్ గా తిరుగుతూ ఉంటాడు. ఇతడి తండ్రి రవికుమార్‌ భీమవరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ముఖేష్‌ సాయి కూడా భీమవరంలోనే తండ్రి వద్దే ఉంటున్నాడు. ఇతడికి జల్సా గా బతకడం అంటే చాలా ఇష్టం. ఇందుకోసం ఇతడు ఒక వెరైటీ పంథా ఎంచుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లని ట్రాప్ చేసి తద్వారా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు.

Recommended