Anchor Suma Funny Reaction On Eating Ice Cream

  • 6 years ago
Anchor Suma Kanakala Facebook post goes viral.

యాంకర్‌ సుమ తన మాటలతో, విసిరే పంచ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే..యాంక‌రింగ్‌లో త‌న‌కి తానే సాటి అని నిరూపించుకుంది సుమ‌. కేర‌ళలో పుట్టి పెరిగిన తెలుగు మాత్రం అద‌రగొట్టేస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉండే సుమ సంద‌ర్భాన్ని బ‌ట్టి కొన్ని పోస్ట్‌లు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కి ప‌సందైన విందు అందిస్తుంది. . ఇక‌ తాజాగా తాను ఐస్‌క్రీమ్ తింటున్న వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అది సాధారణ ఐస్‌క్రీమ్‌ కాదని, ప్రత్యేకమైందని తెలుస్తోంది.ఐస్ క్రీమ్ తింటుంటే నోట్లో నుండి, ముక్కులో నుండి పొగ‌లు వ‌స్తున్నాయి. ఐస్‌క్రీమ్ తింటుంటే ఓ డ్రాగన్ వదిలే శ్వాసలా పొగ వస్తోందని సుమ తెలిపారు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది. ఫేస్‌బుక్‌లో సుమకు దాదాపు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సుమ ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోస్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Recommended