Kohli Posts Anushka Workout Video

  • 6 years ago
తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కోహ్లీ ఏం విషయం పంచుకున్నా అది అభిమానులకు పండగే. అతని లైఫ్ స్టైల్, వైవాహిక జీవితం ఏ విషయమైనా వైరల్‌గా మారాల్సిందే. రెండు రోజుల క్రితం భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. విరామ సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ.. విరామాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ.. ఈ సారి అనుష్కతో కలిసి ఉన్న ఫొటోను ట్యాగ్ చేశాడు.
ఇంతకుముందు పోస్ట్ చేసిన ఫొటోలో అనుష్క కనిపించకపోవడంతో నెటిజన్ల దగ్గర్నుంచి అనుష్క ఏది? ఎక్కడికి వెళ్లింది? అంటూ అభిమానులు ప్రశ్నలు సంధించారు. అయితే వారికి త్వరగానే బదులిచ్చాడు కోహ్లీ. తాజాగా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అనుష్కతో కలిసి జిమ్‌లో కలిసి కసరత్తులు చేస్తోన్న వీడియోను పంచుకున్నాడు.
ఫిట్‌నెస్ కోసం మరో సెషన్‌లో పాల్గొంటున్నాను. చూడండి నాతో పాటు ఎవరున్నారో.. జిమ్‌లో మరింత సరదాగా ఉంది. కార్డియో నా కంటే బాగా అనుష్కే చేస్తోంది. అంటూ కోహ్లీ సరదాగా మాట్లాడుతూ.. అనుష్క వైపు కెమెరా చూపించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

Recommended