Bahubali Producer Shobu Yarlagadda Tweet About Yellow Journalism
  • 6 years ago
“Please don't stoop so low just for the sake of few extra eyeballs and publish such trash ! Creating this kind of fake news will get you nowhere in the long run and will make your website a gossip site and nothing more ! #disgusting #yellowjournalism” Bahubali Producer Shobu Yarlagadda tweeted.

రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి ప్రాజెక్టు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2 పార్టులుగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా 2 వేల కోట్లకుపైగా వసూలు చేసింది. తాజాగా బాహుబలికి ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త నిర్మాతలకు కోపం తెప్పించింది.
సుధీర్ఘ కాలం పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి షూటింగ్ జరుపుకున్నందుకు, భారీ సెట్లు వేసుకున్నందుకు రామోజీరావు రూ. 90 కోట్ల బిల్లు వేశారని, ఇంత బిల్లు వేస్తారని ఊహించని బాహుబలి నిర్మాతలు షాకయ్యారని ఓ ప్రముఖ మీడియా వెబ్ సైట్లో వార్తలు వచ్చాయి.
రామోజీరావు అంత బిల్లు వేయడంతో రాజమౌళి చాలా అప్ సెట్ అయ్యారని.... ఇకపై రామోజీ ఫిల్మ్ సిటీలో ముందు ముందు తాను తీయబోయే ఫిల్మ్స్ తీయకూడదని జక్కన్న నిర్ణయించుకున్నట్లు అర్థంలేని వార్తలు రాయడంతో నిర్మాతలు ఆగ్రహానికి గురయ్యారు.
ఈ గాసిప్ వార్తలపై బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం వల్ల మీరు కొందరి దృష్టిని ఆకర్షించవచ్చు. కానీ ఇదే తీరు కొనసాగితే మీ వెబ్ సైట్ గాసిప్ వెబ్ సైట్ అనే ముద్ర పడుతుంది. ప్రజల్లో మీ మీద నమ్మకం పోతుంది. ఇలాంటి ఎల్లో జర్నలిజం ఇప్పటికైనా ఆపండి అంటూ ఫైర్ అయ్యారు.
Recommended