Kaala Movie Release, IT Companies Declare A Holiday

  • 6 years ago
Rajinikanth's Kaala movie getting ready to release on June 7th.

రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలూ.. ఫ్యాన్స్ ఫీవర్ పట్టుకోవడం చాలా సహజం. అడ్వాన్స్ బుకింగ్ ఎగబడటం, రిలీజ్ రోజున తలైవాపై అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు హంగామా చేస్తుంటారు. ఆ రోజును పండుగల భావించే ఫ్యాన్స్ పనులన్నీ పక్కన పెట్టేసి ఆనందంలో మునిగిపోతారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఆరాట పడుతుంటారు. అందుకే కాలా చిత్రం రిలీజ్ నేపథ్యంలో కేరళలో ఓ ఐటీ కంపెనీ ఏకంగా జూన్ 7వ తేదీని హాలీడే‌గా ప్రకటించడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది.
గతంలో కబాలి చిత్ర రిలీజ్ సందర్భంగా కూడా చాలా సంస్థలు తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి. ఉద్యోగుల సంతోషమే వారి ఆనందంగా భావించడమే కాకుండా జోష్ పెంచే ప్రయత్నం చేశాయి. తాజాగా కేరళలోని టెలియస్ టెక్నాలజీ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ కాలా రిలీజ్ రోజున సెలవు ప్రకటించింది.
ఉద్యోగులందరూ రజనీ మానియాలో ఉన్నారు. వారి సంతోషాన్ని అడ్డుకోవడం అంతగా మంచిది కాదు. వారిని ఆపితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఓ రోజును సెలవుగా ప్రకటించామని సదరు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Recommended