Tammareddy Bharadwaja Talks About Kaala Movie

  • 6 years ago

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రంపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని ఉంది. రేపు జూన్ 7 న ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నా ఇప్పటికి ఆ విషయంలో సందిగ్దత నెలకొని ఉంది. కాలా చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. కావేరి జలవివాదం, ముంబైలో కాలా కథకు సంబందించిన వివాదం ఇలా అనేకం కాలా చిత్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
కాలా చిత్రం వివాదాలతోనే వాయిదా పడుతూ వచ్చింది. జూన్ 7 న చిత్రాన్ని విడుదల చేయాలని ఆమధ్య నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. ఈ సందర్భంలో వివిధ కేసుల వలన ఈ చిత్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
కాలా చిత్రాన్ని కావేరి జల వివాదం వేధిస్తోంది. తమిళనాడుకు అనుకూలంగా రజినీకాంత్ వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలో ఈ చిత్రాన్ని విడుదల కానీయం అని హెచ్చరిస్తున్నారు. కర్ణాటకకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే తమిళనాడులో సినిమా విడుదల కానీ పరిస్థితి ఉందని తమ్మారెడ్డి అన్నారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే ఈ పరిస్థితి నెలకొని ఉందని తమ్మారెడ్డి అన్నారు. మొత్తానికి కాలా చిత్రం పెద్ద చిక్కుల్లోనే ఉందని తమ్మారెడ్డి తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కాలా చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. కొచ్చాడియాన్ చిత్ర వివాదం ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ఆ చిత్రంతో బయ్యర్లు భారీస్థాయిలో నష్టపోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించి కేసు కోర్టులో నడుస్తోంది. అది తేలితే కానీ ఇక్కడ కాలా చిత్రాన్ని విడుదల చేయడానికి వీలు లేదని హెచ్చరిస్తున్నారు.

Recommended