జెడి లక్ష్మీనారాయణ పై విమర్శలు ఎక్కుపెడ్తున్న జనం

  • 6 years ago
Recently, CBI former JD Lakshminarayana has been once again part of the media due to the comments made by a another Lakshmi Narayana...who is BJP AP new president.

ఇటీవల ఒక లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యల కారణంగా మరో లక్ష్మీనారాయణ అనూహ్యంగా మరోసారి మీడియాలో పతాక శీర్షికలకుఎక్కారు. ఆ ఇద్దరు లక్ష్మీనారాయణలు ఎవరో అందరికీ తెలిసిందే. వారిలో ఒకరు ఎపి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కాగా మరొకరు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ. ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు ఆ విషయాన్ని నేరుగా ఆయన్నే ప్రశ్నించగా...అందుకు జవాబుగా ఆయన చెప్పిన సమాధానాలు మాత్రం జనాల చెవుల్లో పూలు పెట్టే చందంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అర్థాంతరంగా పదవీ విరమణ చేసి వచ్చిన సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ రాక వెనక అంతరార్థం ఏంటో అంతుపట్టక ఎపిలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు గిలగిల కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈయన లక్ష్యం ఏమిటి?...ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈయన ఎంచుకున్న వ్యూహమేమిటనేది అర్థం కాక ఆయా పార్టీల నేతలు జట్టుపీక్కుంటున్నారు. ఈయన తనపై గతంలో ఆరోపణలు వచ్చినట్లుగా టిడిపికి అనుబంధమా?...లేక సామాజిక వర్గం కోణం దృష్ట్యా జనసేనకు అనుకూలమా?...లేక బిజెపి వ్యూహంలో పావుగా వచ్చిన ఆ పార్టీకి కాబోయే తురుపుముక్కా...ఈ సందేహాలన్నీ అందర్నీ పీడిస్తూనే ఉన్నాయి. అయితే చల్ల కొచ్చి ముంత ఎవరైనా ఎంతసేపు దాచగలరు?...వాళ్లే బైటపెడతారులే అనే చందంగా...ఎలాగూ బైటపడుతుందనే నమ్మకంతో అందరూ ఆ విషయానికి మరీ అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు.

Recommended