మళ్ళీ బ్యాంకులు బంద్... నగదు కష్టాలు తిరిగి రానున్నాయా?

  • 6 years ago
The two-day nationwide Holidays called by employees and officers of various state-run banks from May 30 (Wednesday) to May 31 (Thursday) is likely to hit banking operations.
#banksHolidays
#atm
#salary
#Money

మే 30,31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు బంద్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ బ్యాంక్స్ అసోసియేషన్‌ కేవలం 2 శాతం వేతన పెంపును ఆఫర్‌ చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు బంద్‌కు పిలుపునిచ్చారు. నెలాఖరు కావడం, ఉద్యోగుల వేతనాలు కూడా ఈరోజుల్లోనే క్రెడిట్ అయ్యే అవకాశం ఉండటంతో బంద్ ప్రభావం వారిపై పడనుంది.
ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను మంగళవారమే క్రెడిట్ చేసే అవకాశం ఉంది. అయితే వేతనాలు క్రెడిట్ అయినప్పటికీ.. ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునే వీలు ఉండకపోవచ్చు. రెండు రోజులు బంద్ కావడంతో ఏటీఎంలలో డబ్బు పెట్టే అవకాశం లేదు. అదీగాక సెక్యూరిటీ గార్డులు సైతం బందులో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి.. ఏటీఎంలు రెండు రోజులు మూతపడే అవకాశం లేకపోలేదు.
ఒకవేళ థర్డ్ పార్టీతో కలిసి ఏటీఎంలలో క్యాష్ అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. సెక్యూరిటీ కూడా బంద్ లో పాల్గొంటే వాటి నిర్వహణ కష్టంగా మారుతుంది. రెండు రోజులు బంద్ కావడంతో కస్టమర్లు కూడా భారీగా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో నగదు కొరత కూడా ఏర్పడుతుందని అపెక్స్‌ బ్యాంకు యూనియన్‌ ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటచలం ముందస్తు హెచ్చరికలు జారీచేశారు.