Big Boss 2 Contestants List Leaked
  • 6 years ago
Kamal Haasan will return as a host of the popular reality show Bigg Boss. The reports suggests it might be Simran or Kasthuri. An Item girl is expected to be one of the participants as well. And there will also be a popular comedian. The same reports states that Oviya will appear on the show for a day as a celebrity guest.
#BiggBoss
#KamalHaasan

ఐపీఎల్ క్రీడా వేడుకలు ఘనంగా ముగిసాయి. దాదాపు రెండు నెలలపాటు ఉర్రూతలూగించిన ఈ క్రీడా వినోదం తర్వాత, దక్షిణాదిలో మరో భారీ వినోద కార్యక్రమం మొదలు కాబోతున్నది. అదేమిటంటే.. బిగ్‌బాస్ రెండో సీజన్. తెలుగు, తమిళ భాషల్లో రెండో సీజన్‌కు రంగం సిద్దమవుతున్నది. తెలుగులో ఎన్టీఆర్ స్థానంలో నాని, తమిళంలో కమల్ హాసన్‌గా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు. అయితే తమిళ వెర్షన్‌పై వస్తున్న ఊహాగానాలు ఇలా ఉన్నాయి.
తమిళ భాషలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్2కు సంబంధించిన వార్తలు, గాసిప్స్ అనేకంగా మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే దానిలో పాల్గొనేబోయే హౌస్‌ సభ్యుల పేర్లు తాజాగా తెరపైకి వస్తున్నాయి. అయితే వాటిపై బిగ్ బాస్ నిర్వాహకులు స్పందించకపోవడంతో ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.
తాజా సమాచారం ప్రకారం.. తమిళ బిగ్‌బాస్‌లో సిమ్రాన్ లేదా కస్తూరి గానీ పాల్గొనే అవకాశం ఉంది అని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో ఐటెంగర్ల్‌గా పేరున్న హీరోయిన్, టాప్ కమెడియన్ కూడా బిగ్‌బాస్‌కు ఎంపికైనట్టు సమాచారం.
గత బిగ్‌బాస్‌లో వివాదాస్పద సభ్యురాలిగా మారిన ఓవియా హెలెన్ కూడా రెండో సీజన్‌లో గెస్టుగా కనిపించే అవకాశం ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఒకరోజు అతిథిగా ఉండబోతున్నట్టు సమాచారం. ఇంకా జాబితాలో క్రేజీ సినీ, టెలివిజన్ తారలు పాల్గొనే అవకాశం ఉంది.
Recommended