Kohli Bids Farewell To ‘Brother’ AB De Villiers
  • 6 years ago
Indian skipper Virat Kohli on Saturday took to social media to pay tribute to “brother” AB de Villiers after the South African great announced his decision to quit international cricket.
#abdevilliers
#viratkohli
#royalchallengersbangalore


తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. డివిలియర్స్ ఉన్నపళంగా అన్ని ఫార్మాట్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో క్రికెట్ లోకం ఒక్కసారిగా షాక్‌కి గురైంది.
డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై ఐసీసీ, బీసీసీఐ సహా పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేశారు. ఐపీఎల్‌లో డివిలియర్స్‌తో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడి రిటైర్మెంట్‌పై ఏం స్పందిస్తాడని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
తాజాగా శనివారం డివిలియర్స్ రిటైర్మెంట్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిశ్శబ్దం వీడాడు. 'మై బ్రదర్.. నువ్వు చేసే ప్రతి పనిలో మంచి జరగాలని కోరుకుంటున్నా. క్రికెట్లో బ్యాటింగ్ చేసే విధానాన్నే మర్చేశావ్. నీకు నీ కుటుంబానికి నా అభినందనలు. జీవన ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా' అని ట్విట్టర్‌లో డివిలియర్స్ రిటర్మెంట్‌పై కోహ్లీ ఎమోషనల్‌ అయ్యాడు.
క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌కు 'మిస్టర్ 360' అని పేరుంది. ఎలాంటి షాట్లునైనా అలవోకగా ఆడగలడన్న పేరుంది. అందుకే ఏబీని ముద్దుగా అభిమానులు మిస్టర్ 360 డిగ్రీస్ అని పిలుస్తారు. 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు బుధవారం తన ట్విట్టర్‌‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు.
Recommended