Raj Tarun Interview About New Movie

  • 6 years ago
Young actor Raj Tarun, who has stuttered in recent times after an encouraging start to his film career, is looking to bounce back with his Raju Gadu', starring Raj Tarun, Amyra Dastur and Rajendra Prasad, will hit the screens on June 1.
#RajTarun
#AmyraDastur
#RajendraPrasad

ఉయ్యాలా జంపాలా','సినిమా చూపిస్త మావ','కుమారి 21ఎఫ్‌' వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టిన రాజ్‌ తరుణ్‌ ఈ మధ్య రంగుల రాట్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా రాజుగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకురాలు సంజన ఈ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రి ఎవ్వబోతోంది. రాజుగాడు సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ తో ఇంటర్వ్య
సినిమాలో హీరో పేరు రాజు కావడంతో అందరు రాజుగాడు అని పిలుస్తూ ఉంటారు. అందుచేత సినిమాకు రాజుగాడు టైటిల్ పెట్టడం జరిగింది. సినిమా మొత్తం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా హాయిగా నవ్వుకొని వెళ్ళే సినిమా రాజుగాడు.
రాజుగాడు సినిమాలో హీరో క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో భాధపడుతుంటాడు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే.. తనకు తెలియకుండానే తన చెయ్యి దొంగతనం చేయడం. ఇది ఒకరకంగా వింత జబ్బు అనాలి. ఈ జబ్బు బయట చాలా మందికి ఉంటుంది.
గతంలో నేను రాజేంద్రప్రసాద్ కలిసి నటించాం. రాజుగాడు సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో పూర్తి స్థాయిలో మా కాంబినేషన్ వర్క్ అవుట్ అయ్యింది. సినిమా మొత్తం ఆయన ఉంటాడు. మా మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటాయి.
రాజుగాడు సినిమాలో అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తనతో నేను కలిసి నటించడం మొదటిసారి. పరిచయం లేదుకావున సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. తరువాత బాగా కలిసిపోయాం. షూటింగ్ కి తను కరెక్ట్ టైం కి వచ్చేది.

Recommended