Ram Charan Wish To Make A Movie In Bollywood

  • 6 years ago
Telugu actor-producer Ram Charan says he is ready to explore Bollywood and wishes to work with Rajkumar Hirani. Ram said: “I am a huge fan of Rajkumar Hirani sir and would love to work with him. He is one of those filmmakers who is balancing the art and commerce rightly in his films. I so wish to work with him. I have also watched a few films of Vishal Bhardwaj and he makes some amazing pieces of cinema. Working with him would be such a pleasure.”
#RamCharan
#Bollywood
#RajkumarHirani

దక్షిణాది హీరోల దృష్టి ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమపై పడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ కార్వాన్ అనే చిత్రంతో హిందీలోకి ప్రవేశిస్తున్నారు. ఇక మరోసారి రాంచరణ్ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇటీవల ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి పలు విషయాలు వెల్లడించారు.
బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక, నిర్మాత రాజ్ కుమార్ హిరాణి‌కు వీర ఫ్యాన్‌ను. ఆయనతో పనిచేయాలని ఉంది. కమర్షియల్, ఆర్ట్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తీయడంలో ఆయనకు ఎదురులేదు. అలాంటి దర్శకుడితో పనిచేయాలని ఉంది అని రాంచరణ్ అన్నారు.
అలాగే నాకు దర్శకుడు విశాల్ భరద్వాజ్ అంటే కూడా ఇష్టం. అతను రూపొందించిన చిత్రాలంటే చాలా ఇష్టం.ఆయనతో పనిచేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాను. గతంలో జంజీర్ చిత్రంలో నటించాను. కానీ అది సరిగా ఆడలేదు. మరోసారి బాలీవుడ్‌లో నటించాలని ఆసక్తి కలుగుతున్నది. ట్రై చేస్తే తప్పేముంది అని రాంచరణ్ పేర్కొన్నారు.
బాలీవుడ్‌లో మంచి దర్శకుడు, కథ, ప్రొడక్షన్‌తో కూడిన ప్రాజెక్ట్ లభిస్తే నేను నటించడానికి సిద్ధం. నాకున్న మార్కెట్‌ను బట్టి ఈసారి ప్రయత్నిస్తాను అని రాంచరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంచి కథ దొరికితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్దం అని అన్నారు.