Harvey Weinstein Went Behind The Bars

  • 6 years ago
Film producer Harvey Weinstein on Friday surrendered to authorities at a New York City police station on charges, months after he was toppled from Hollywood’s most powerful ranks by scores of women him of . More than 70 women have accused the co-founder of the Miramax film studio and Weinstein Co of , , with some dating back decades. Weinstein has been charged with one woman and forcing another to perform on him, the New York Times reported, citing unidentified law enforcement officials.
#HarveyWeinstein
#Miramaxfilmstudio

హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లైంగిక దాడులకు పాల్పడిన హార్వే వెయిన్‌స్టెయిన్ ఉదంతం ప్రపంచ సినీ పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో వెయిన్‌స్టెయిన్‌పై
పలువురు హీరోయిన్లు, మహిళానటులు, సెలబ్రిటీలు ఆరోపణలు సంధించిన విషయం తెలిసిందే. దాదాపు 70 మంది మహిళలు తమపై లైంగిక దాడులు హార్వే చేశాడని ఆరోపణలు చేయడం సెన్సేషన్‌గా మారింది.
హాలీవుడ్ పరిశ్రమకు చెందిన 70 మంది సినీ ప్రముఖులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో హార్వే వెయిన్‌స్టెయిన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ సిటీ పోలీసు స్టేషన్‌లో హార్వే వెయిన్‌స్టెయిన్ లొంగిపోయారు. ఆయనపై ఫస్ట్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ రేప్‌ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ్యవాప్తంగా వ్యాపార, ప్రభుత్వ, వినోద రంగాలకు చెందిన మహిళలు హార్వే వెయిన్‌స్టెయిన్‌పై ఫిర్యాదు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మీటూ ఉద్యమం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అమెరికా పోలీసులు తీవ్రంగా స్పందించారు.
వెయిన్‌స్టెయిన్‌పై అనేక రకాల రేప్ కేసులు నమోదయ్యాయి. ఓ మహిళను ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేశారనే ఫిర్యాదు అందింది అని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. ఈ విషయాలను న్యూయార్క్ పోలీసులు కూడా ధృవీకరించారు.

Recommended