KL Rahul Accepts Virat Kohli's Fitness Challenge

  • 6 years ago
India's Sports and Youth Minister, Rajyavardhan Rathore, began an initiative for celebrities to inspire people to get fit by posting a video of himself doing push-ups on Tuesday.
#viratkohli
#klrahul
#hardikpandya
#teamindia

మొదలెట్టింది మంత్రే.. కానీ, కోహ్లీ పిలుపుకే ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. మూడు రోజులుగా ఫిట్‌నెస్ ఛాలెంజ్ పేరుతో ట్విట్టర్ వేదికగా సెలబ్రిటీలందరూ ఈ పనికి పూనుకున్నారు. తాము ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోలన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా పంచుకుంటూనే మరొకరికి ఛాలెంజ్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ పిలుపునిచ్చిన 'ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌' మూడ్రోజుల్లోనే బాగా పాపులర్‌ అయ్యింది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ స్వీకరించాడు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ విసిరిన ఛాలెంజ్ కోహ్లీకీ, హృతిక్ రోషన్‌కు, సైనా నెహ్వాల్‌కు పంపాడు. అది కోహ్లీ నుంచి అనుష్క శర్మకు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేఎల్ రాహుల్‌కు పాకింది.
తాజాగా కోహ్లీ ఛాలెంజ్‌ను స్వీకరించిన కేఎల్ రాహుల్ తన ఫిట్‌నెస్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. తన తర్వాతి ఛాలెంజ్‌ను హార్ధిక్ పాండ్యాకు పంపాడు. 'హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌' నినాదంతో రాథోడ్‌ మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్‌ చాలా బాగుంది. కోహ్లీ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. హార్దిక్‌ పాండ్య, దినేశ్‌కార్తీక్‌కు ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను విసురుతున్నాను' అని రాహుల్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన కేఎల్‌ రాహుల్‌ టోర్నీలో బాగా రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 659 పరుగులు సాధించాడు.

Recommended