కుమార విజయం.. బల పరీక్షకు ముందే బీజేపీ వాకౌట్

  • 6 years ago
Karnataka Chief minister HD Kumaraswamy today wins floor test in Karnataka legislative assembly.
#karnatakaassemblyfloortest2018
#karnatakaelectionresults2018
#hdkumarasamy
#bsyeddyurappa
#JDS

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి శాసన సభలో బలపరీక్షలో విజయం సాధించారు. శుక్రవారం విధాన సౌధలో బలపరీక్షకు ముందే బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ప్రతిపక్షం వాకౌట్ చెయ్యడంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతానికి గట్టెక్కింది. ఆరు నెలలు సీఎం కుర్చికి ఎలాంటి ఢోకా లేదు. బలపరీక్ష పూర్తి కావడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇంటికి పంపిస్తున్నారు.
శుక్రవారం 12.15 గంటల సమయానికి కర్ణాటక శాసన సభ ప్రారంభం అయ్యింది. కర్ణాటక స్పీకర్ గా శ్రీనివాసపురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్. రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అనంతరం సీఎం కుమారస్వామి, ప్రతిపక్ష నాయకుడు బీఎస్. యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే. శివకుమార్ తదితరులు రమేష్ కుమార్ ను అభినందించారు.
స్పీకర్ ఎన్నిక పూర్తి అయిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ తాను శాసన సభలో ఎమ్మెల్యేల బలపరీక్షకు సిద్దమని, తనకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ కు మనవి చేశారు.
కర్ణాటక శాసన సభలో హెచ్.డి. కుమారస్వామి తాను గతంలో 20 నెలల పాటు ముఖ్యమంత్రిగా పని చేశానని పాత రోజులు గుర్తు చేసుకున్నారు. ఇదే సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ మీద విమర్శలు చేశారు. ఐటీ, ఈడీ దాడులకు తాము భయపడమని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని కుమారస్వామి హెచ్చరించారు.

Recommended