అప్పుడు బాబాయ్ వద్దన్నాడు, ఇప్పుడు అసలే ఆలోచించను: రామ్ చరణ్
  • 6 years ago
“I was very excited and geared up to start campaigning during Prajarajyam but it was my uncle Pawan Kalyan who stopped me and told me ‘This is too early for you’, I wouldn’t think twice if he calls me now for his political campaigns. I will join immediately and support him in his journey,” Ram Charan said at 'Happi Mobiles' Launch event.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చాలా కాలం తరువాత కార్పొరేట్ బ్రాండింగ్ లోకి దిగాడు. మగధీర సమయంలో పెప్సీ వంటి సంస్థలకు రాంచరణ్ బ్రాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రాంచరణ్ రంగస్థలంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. రంగస్థలం చిత్రంతో రాంచరణ్ స్థాయి మరో లెవల్ కు చేరింది. చరణ్ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. హ్యాపీ మొబైల్స్ సంస్థతో రాంచరణ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై గురువారం రోజు మీడియా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాంచరణ్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ సపోర్ట్ గురించి చరణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలో డొకొమో, పెప్సీ లాంటి బ్రాండ్లతో అసోసియేట్ అయిన ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన హ్యాప్పి మొబైల్స్ సోర్స్‌తో అసోసియేట్ అయ్యారు. ఈ సంస్థ తరుపు 18 నెలల పాటు ప్రచారం చేసేలా డీల్ కుదుర్చుకున్నారు.
డొకొమో, పెప్సీ లాంటి బ్రాండ్ల తర్వాత ఇంకో బ్రాండ్ సెలక్ట్ చేసుకోవడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకు? అనే ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ.... అన్ని కుదరాలి. మైండ్ సెట్ కూడా ఒప్పుకోవాలి. వాళ్లు డబ్బులిచ్చారు, ఫోటో షూట్ చేశాం, పోస్టర్ మీద ఎక్కించాం లాంటి మెకానికల్ యాటిట్యూడ్ నాకు సెట్టవ్వదు. ఏదైనా బ్రాండుకు అసోసియేట్ అయితే దాని రూట్స్ వరకు వెళ్లాలి అనేది నా కోరిక... అని రామ్ చరణ్ అన్నారు.
Recommended