Nela Ticket Premier Show

  • 6 years ago
nela ticket Premier show Talk.Ravi Teja's Nela Ticket Movie Premier show talk. Director Kalyan Krishna not able to repeat his magic

మాస్ మహారాజ రవితేజ నటించిన నేల టికెట్ చిత్రం మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి. వరుస పరాజయాలతో ఉన్న రవితేజకు రాజా ది గ్రేట్ చిత్రంతో ఓ హిట్ దక్కింది. ఆ తరువాత వచ్చిన టచ్ చేసి చూడు చిత్రం నిరాశ పరిచింది. ఈ తరుణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటించడంతో నేల టికెట్ చిత్రంపై అంచనాలు పెరిగాయి. రవితేజ సరసన మాళవిక శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆమెకు ఇది డెబ్యూ మూవీ. ప్రీమియర్ షోల నుంచి వస్తున్న రెస్పాన్స్ బట్టి రవితేజకు అవసరమైన హిట్ దక్కిందా లేదా తెలుసుకుందాం.
రవితేజ కామెడీ టైమింగ్ ని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. రవితేజ నుంచి ఆడియన్స్ ఆశించేది కూడా అదే. సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఫ్యామిలీ అంశాలతో పాటు వినోదాత్మక అంశాలు కూడా చక్కగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఆడియన్స్ మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, రవితేజ నుంచి అభిమానులు ఆశించిన అంశాలు ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కనిపించవు. కథని మొదలుపెట్టిన విధానం, స్క్రీన్ ప్లే పూర్తిగా నిరాశపరిచే విధంగా ఉంటాయి. రవితేజ మార్క్ కామెడీ లేదు.