Tammareddy Bharadwaj Gets Serious On Media

  • 6 years ago
Tollywood Veteran Director Tammareddy Bharadwaj says don't be Scared to get into Movie Industry to all the women / Female aspirants who want to make a career in film industry. Finally, he made some interesting comments on present Cinema Industry & media.
#Tollywood
#TammareddyBharadwaj

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా గొడవలు జరిగాయి. దీంతో ఇండస్ట్రీ మీద ప్రతి వారికి ఒక చులకన భావం ఏర్పడింది. ఊళ్లో ఎవరైనా ప్రాసిట్యూట్ పట్టుబడినా సినిమా వాళ్లు అంటున్నారు, డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినా సినిమా వారితో లింకు పెడుతున్నారు. మొన్న ఏదో దొంగతనం కేసులో కూడా సినిమా ఇండస్ట్రీ పేరు వినిపించింది. దీంతో చాలా మంది ఆడ పిల్లలను సినిమా ఇండస్ట్రీకి పంపించడానికి భయపడుతున్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు ఇండస్ట్రీ అంతదారుణంగా అయితే ఏమీలేదని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.
ఇండస్ట్రీలో ఏం జరిగినా మీడియా ద్వారా వార్తలు వెలుగులోకి వచ్చినంత తొందరగా యాక్షన్ తీసుకోవడం కుదరదు. దానికి సంబంధించిన వారు ఎవరో ఒకరు కంప్లయింట్ ఇవ్వాలి, ఎవరైతే విక్టిమ్ అవుతారో వారు ఇండస్ట్రీలోని సంబంధిత యూనియన్లో, లేదా ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు చేయాలి. లేదా పోలీసులకు చెప్పాలి. ఇలా ఎవరికీ కంప్లయింట్ ఇవ్వకుండా సినిమా వాళ్లు అన్యాయం చేశారు అని మీడియా ముందుకు వెళితే ఎలా? ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ గురించిన గొడవ తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చింది. కమిటీలు వేశారు. కొన్ని రూల్స్ పెట్టారు. స్త్రీలను ఆడిషన్ చేయాలంటే ఇలా చేయాలి అని కొన్ని నిబంధనలు పెట్టారు. ఇలా రకరకాలుగా మంచి మంచి చర్యలు చేపట్టారు. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేస్తారు... అని తమ్మారెడ్డి తెలిపారు.

Recommended