From Karnataka To UP : Sportsmen Who Turned To Politicians

  • 6 years ago
The country has been gripped by the unfolding political drama in Karnataka where the BJP and Congress are in a mighty tussle to grab the power post the results announcement.
#Karnataka
#BhaichungBhutia
#NavjotSinghSidhu
#Sports

సర్వత్రా ఆసక్తిని రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు రానేవచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన నేపథ్యంలో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ఫలితాల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడింది.
దీంతో అధికార పీఠం ఎవరికి దక్కుతుందనే విషయంపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. 104 స్థానాలతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ 78 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌, 38 స్థానాల్లో విజయం పొందిన జేడీఎస్‌ పార్టీలు ఒక్కటై ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
అతి పెద్ద పార్టీనే తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని అటు బీజేపీ అంటుండగా, మరోవైపు తమకు కావాల్సిన మద్దతు ఉన్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అంటోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి.
ఈ క్రమంలో పార్టీలు కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం రిసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టాయి. అయితే, ఏ పార్టీని పిలవాలనే దానిపై ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మంగళవారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 104 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది.
ఇక, కాంగ్రెస్‌ 78, జేడీ(ఎస్‌) 38, ఇతరులు 2 స్థానాలు గెలుచుకున్నారు. రాష్ట్రంలోని 224 స్థానాలకు గానూ 222 స్థానాలకు ఈనెల 12న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
గతంలో పలువురు క్రీడాకారులు కూడా రాజకీయ నాయకులుగా మారారు. వారెవరో ఒక్కసారిగా చూద్దామా...

Recommended