Karnataka Assembly Elections 2018 Final Result Updates
  • 6 years ago
The wait is over. The result of Karnataka assembly elections 2018, which was dubbed as the biggest political battle of the year, would be declared today (May 15) and you can catch all the live action here.

క్షణ, క్షణానికి ఉత్తంఠరేపుతున్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా... మ్యాజిక్ ఫిగర్‌ దక్కకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో... పొత్తుల ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన కాంగ్రెస్ జేడీఎస్‌తో మంతనాలు ప్రారంభించింది. ఇటు బీజేపీ కూడా ఢిల్లీ నుంచి బెంగళూరుకు పార్టీ దూతల్ని పంపించింది. ఒక్కసారిగా మారిన రాజకీయ పరిణామాలతో... రెండు జాతీయ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై పావులు కదుపుతున్నాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. ఫలితాల సరళి సంకీర్ణం దిశగా సాగడంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం అతిపెద్ద పార్టీగా అవతరించినా, సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాలకు కొద్ది దూరంలో నిలిచిపోయింది.
ఎన్నికల కమిషన్ ప్రకటించిన అధికారిక ఫలితాల ప్రకారం 75 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, మరో 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
పార్టీ 43 చోట్ల విజయం సాధించి, 35 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది.
18 స్థానాల్లో గెలుపొంది, 19 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ కంటే తక్కువ శాతం ఓట్ల సాధించిన బీజేపీ అధిక స్థానాల్లో సత్తా చాటడం విశేషం.
bjp-*104 36.2% Votes
congress- 78 37.9% Votes
JDS- 38 18.2% Votes
Others- 2
Recommended