కర్ణాటక ఎలక్షన్స్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ల పై పడనుందా??

  • 6 years ago
Reversing early losses, the Stcok market and Nifty moved higher as BJP pulled ahead in Karnataka elections, according to early leads. Markets had opened flat as early leads indicated Congress and BJP locked in close fight in Karnataka.
#ExitPolls
#KarnatakaAssemblyElections2018
#Siddaramaiah

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. దేశ వ్యాప్తంగా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో స్టాక్ మార్కెట్లు కూడ క్షణక్షణానికి మారుతున్నాయి.
ప్రీ ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల దిశగా దూసుకెళ్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 35,707 వద్ద, నిఫ్టీ 32పాయింట్ల లాభంతో 10,839 వద్ద కొనసాగుతున్నాయి.
కన్నడ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఉదయం కాంగ్రెస్‌, భాజపా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆ తర్వాత భాజపా ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఎన్నికల్లో భాజపా గెలిస్తే దేశీయ మార్కెట్లు కూడా భారీ లాభాలను సాధించే అవకాశముందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు రూపాయి కోలుకొందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అయితే స్టాక్ మార్కెట్లపై కన్నడ ఓటర్ల తీర్పు కన్పించే అవకాశం ఉన్నందున ఆ ప్రభావం తుది ఫలితాలు వచ్చిన తర్వాత మరింత స్పష్టంగా కన్పించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Recommended