Dachepalli Incident : Poonam Kaur Responded Seriously On Old Man

  • 6 years ago
Actor Poonam Kaur reacts on Dachepalli of Guntur incident. 50 year old Rickshaw puller attmept on 9 old girl. On that incident Poonam Kaur tweet.. This uncontrollable animal instincts of few men is making life horrible ,,,, if all of this is true ..this man should be hanged till death in front of public ... your mind should be chopped along the organ which makes u a male not a man ...
# Poonam Kaur
#Guntur incident

సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై తరుచుగా సినీ నటులు తరుచుగా స్పందిస్తుంటారు. ఇటీవల కాలంలో జరుగుతున్న లైంగిక దాడులపై దేశవ్యాప్తంగా సినీ నటులు స్పందిస్తున్నారు. కథువాలో 8 సంవత్సరాల బాలికపై జరిగిన లైంగిక దాడిని సినీ నటులు తీవ్రంగా ఖండించారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో చిన్నారిపై జరిగిన లైంగిక దాడిపై సినీ నటి పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించింది. ఇంతకీ ఏమి జరిగిందంటే..
గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో దారుణంగా చోటుచేసుకొన్నది. 50 ఏళ్ల వ్యక్తి 9 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ రిక్షా కార్మికుడు బాలికను చాక్లెట్ ఆశజూపి ఇంట్లోకి పిలిచి అమానుషానికి పాల్పడ్డాడు. బాలికపై దాడి చేసి నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
బాలికను పరీక్షించిన వైద్యులు.. ఒంటిపై గాయాలున్నట్టు ధృవీకరించాడు. లైంగికంగా దాడి చేశాడని వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని హింసాత్మక సంఘటనలు చోటుచేసుకొన్నాయి.
దాచేపల్లి అమానుష ఘటనపై పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించింది. బాలికపై లైంగిక దాడి జరిపిన వ్యక్తి అంగాన్ని నరికివేయాలి అని పూనమ్ ట్వీట్ చేసింది. చిన్నారిపై దుర్మార్గానికి ఒడిగట్టిన అతడిని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.
లైంగిక కోరికలను అదుపుచేసుకొలేని, మానవ రూపంలో ఉన్న మృగాలు జీవితాలను చాలా దారుణంగా మారుస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ఆ వ్యక్తిని పబ్లిక్ ఉరితీయాలి. మళ్లీ మగాడినని భావించకుండా ఆ వ్యక్తి అంగాన్ని నరికివేయాలి అని పూనమ్ ట్వీట్ చేసింది.

Recommended