చంద్రబాబు ఫ్రెండ్, మరిన్ని అధికారాలు కావాలి: కేసీఆర్‌

  • 6 years ago
Telangana CM Chandrasekar Rao meets DMk Working President MK Stalin in Chennai. In this meeting there may be discussion about 3rd front which contains Non Congress and Non BJP.
తమకు సంబంధం లేని అంశాలను కేంద్రం రాష్ట్రాలకు బదలాయించాలని, రాష్ట్రానికి మరిన్ని నిధులు, అధికారాలు రావాలని, ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇది ప్రారంభం లేదా ముగింపు కాదని మరిన్ని చర్చలు జరుపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం అన్నారు.
ఆయన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, డీఎంకే అధినేత కరుణానిధితో భేటీ అయిన విషయం తెలిసిందే. స్టాలిన్, కేసీఆర్‌లు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆయన నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇరువురు కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలన్నారు.
దేశంలో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు సహా చాలా అంశాలపై స్టాలిన్‌తో చర్చించినట్లు తెలిపారు. దేశంలోని పరిణామాలపై చర్చించామన్నారు. తాను చాలా కాలం తర్వాత చెన్నైకు వచ్చానని చెప్పారు. రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై మమతా బెనర్జీతోను చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.

Recommended