క్షమాపణలు చెప్పిన త్రిపుర సీఎం

  • 6 years ago
Tripura Chief Minister Biplab Kumar Deb on Friday regretted his remarks questioning the crowning of Diana Hayden as "Miss World" in 1997 and alleging that international beauty contests were a farce.
గురువారం చేనేత - హస్త కళల కార్యశాలలో సీఎం బిప్లవ్ కుమార్ మాట్లాడుతూ.. డయానా హెడెన్‌కు అసలు ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పూర్వం భారతీయ మహిళలు సౌందర్య సాధనాలను, షాంపూలను ఉపయోగించలేదని, మట్టి రుద్దుకొని స్నానం చేసేవారని, మెంతి నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకునేవారని, అందాల పోటీ నిర్వాహకుల మాఫియా మన దేశంలోకి చొచ్చుకు వచ్చిందని, ఇప్పుడు ఏ మూల చూసినా బ్యూటీ పార్లర్ కనిపిస్తోందన్నారు.
వాళ్లకు సర్టిఫికేట్స్ ఇచ్చేవారు అందర అంతర్జాతీయ టెక్స్‌టైల్స్ మాఫియావారేని, అవార్డు ఎవరికవ్వాలో వారు ముందే నిర్ణయిస్తారని, భారతీయ మహిళలకు ప్రతిరూపమైన ఐశ్వర్యా రాయ్‌కు ప్రపంచ సుందరి కిరీటం ఇచ్చారంటే అర్థం ఉందని, కానీ డయానా హెడెన్‌కు ఏం చూసి ఆ టైటిల్ ఇచ్చారో అర్థం కావడం లేదని బిప్లవ్ కుమార్ అన్నారు. మనవాళ్లు ప్రపంచ సందరి, విశ్వసుందరి కిరీటాలు దక్కించుకున్నప్పుడు అంతర్జాతీయ సంస్థలు మన దేశంలోకి చొచ్చుకు వచ్చాయన్నారు. అయితే ఆయన డయానాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
బిప్లవ్ కుమార్ దేవ్ తనపై చేసిన వ్యాఖ్యలపై డయానా హెడెన్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, చామనఛాయ ఉన్నందుకు గర్వపడాల్సింది పోయి, తక్కువచేసి మాట్లాడటం బాధించిందన్నారు. తెల్లని చర్మ రంగుకు ప్రాధాన్యమిచ్చే సంకుచిత మనస్తత్వంపై తాను చిన్నప్పట్నుంచే పోరాడుతున్నట్లు చెబుతూ ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

#Diana hayden
#Tripura
#Chief Minister
#Biplab Kumar Deb
#India
#Miss World

Recommended