Sai Pallavi's Kanam Movie Promo

  • 6 years ago
ai Pallavi and Naga Shaurya starrer horror drama 'Kanam' has got a release date. The film will be coming to theatres on the 27th of April. In this occassion, Producer NV Prasad revealed about movie. He said that Sai Pallavi, Naga Shourya will attract the audience with their performance.
#kanam
#sai pallavi
#Naga Shaurya
'ఫిదా' తో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసి 'ఎం.సి.ఏ' తో ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన 'కణం' లో నాగ శౌర్య తో కలిసి కనిపించబోతోంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో ఎన్.వి.ఆర్ సినిమాస్ సమర్పణలో నిర్మితమైన 'కణంస ఏప్రిల్ 27న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా.. ఎన్‌.వి.ప్ర‌సాద్ మాట్లాడుతూ - సాయిప‌ల్ల‌వి, నాగ‌శౌర్య‌ల‌తో చేసిన కణం ఓ ఎమోష‌న‌ల్ మూవీ. త‌ల్లికి, కూతురుకి మ‌ధ్య ఉన్న బాంధ‌వ్యాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. చిత్రంలో వెరోనికా పాత్ర‌లో న‌టించిన అమ్మాయి చాలా అద్భుతంగా న‌టించింది. సినిమాలో కనిపించే ఎమోషన్స్ అన్ని చాలా సహజంగా ఉంటాయి. తనకి ఏమి కావాలో స్పష్టంగా తెలిసిన దర్శకుడు ఉన్నప్పుడు మన పని సులువు అయిపోతుంది. దర్శకుడు విజయ్ గారు ఎక్స్‌ట్రార్డిన‌రీగా తెర‌కెక్కించారు. శామ్ సి.ఎస్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, నిర‌వ్ షా సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు అద‌న‌పు బ‌లం. ఆల్‌రెడీ విడుద‌లైన ట్రైల‌ర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నాం అన్నారు.
ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.

Recommended