IPl 2018: Stalin Opposes Imposing Case On Protestors

  • 6 years ago
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని తమిళనాడు ప్రభుత్వం పోలీసు పవర్ తో అరెస్టు చేయించిందని, 780 మంది మీద కేసులు ఎత్తివేసి వెంటనే వారిని విడుదల చెయ్యాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే వరకు చెన్నైలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించరాదని స్టేడియం సమీపంలోని వల్లాజ రోడ్డులో నిరసన వ్యక్తం చేస్తున్న వారీ మీద పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని ఎంకే. స్టాలిన్ ఆరోపించారు.
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలనే ప్రజల సెంటిమెంట్ మీద తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు దెబ్బకొట్టాయని ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు.కావేరీ సమస్య తమిళనాడు ప్రజల అందరి సమస్య అని ఎంకే. స్టాలిన్ గుర్తు చేశారు.
ప్రముఖ దర్శకుడు భారతీరాజా, గేయ రచయిత వైరముత్తు, నామ్ తమిళర్ కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు, దర్శకుడు సీమాన్ తో సహ మొత్తం 780 మంది మీద గ్రేటర్ చెన్నై పోలీసులు కేసులు నమోదు చేశారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు కోసం ఆందోళన చేసిన వారి మీద వెంటనే కేసులు ఎత్తివేయాలని ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.
మంగళవారం సాయంత్రం చెన్నై నగరంలోని అన్నాసరై ప్రాంతంలో ఆందోళన చేస్తున్న కొందరు కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల మీద దాడి చేసిన కేసులో ప్రముఖ దర్శకుడు, నామ్ తమిళర్ కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు సీమాన్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.