IPL 2018: Quick Dismissals Of Me And AB Hurt RCB: Virat Kohli
  • 6 years ago
Royal Challengers Bangalore skipper Virat Kohli said the quick dismissals of him and AB de Villiers thwarted the team's momentum against Kolkata Knight Riders - a match that they lost by four wickets at the Eden Gardens on Sunday (April 8). "I think we were 15 runs short with the bat. I played too many dot balls and couldn't get any momentum going.

'మేం 15 పరుగులు తక్కువ చేశామని అనుకుంటున్నా' కోల్‌కతాతో మ్యాచ్ ముగిసిన అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలివి. ఐపీఎల్ 11వ సీజన్‌లో కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు జట్టుకు శుభారంభం దక్కలేదు.
ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాళ్లలో డివిలియర్స్(44), మెకల్లమ్(43) రాణించారు.
అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా విజయంలో ఓపెనర్ సునీల్ నరైన్ (19 బంతుల్లో 50, 4ఫోర్లు, 5సిక్స్‌లు) కీలకపాత్ర పోషించాడు. ఆర్‌సీబీ బౌలర్లను ఊచకోత కోస్తూ ఈడెన్‌లో బౌండరీల వర్షం కురిపించాడు.
దీంతో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవడంపై మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తాము మరో 15 పరుగులు చేసి ఉండాల్సిందని.. కీలకమైన సమయాల్లో సరిగ్గా ఆడలేకపోయామని అభిప్రాయపడ్డాడు. 'మేం 15 పరుగులు తక్కువ చేశామని అనుకుంటున్నా. నేను చాలా డాట్‌ బాల్స్‌ ఆడా. మూమెంట్‌‌ను అందుకోలేకపోయా' అని కోహ్లీ అన్నాడు.
'ఏబీ డివిలియర్స్‌, నేను వరుస బంతులకే వెనుదిరగడంతో ఆట కీలక మలుపు తిరిగింది. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అనంతరం కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ సునీల్‌ నరైన్‌ మ్యాచ్‌ను తన వైపు తిప్పుకున్నాడు. ఈ పిచ్‌పై స్పిన్నర్లు బౌలింగ్‌ చేయడం కష్టమే. మేం మాత్రం బాగానే ఆడాం అనుకుంటున్నా. వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను 19వ ఓవర్‌ వరకూ తీసుకొచ్చాం' అని అన్నాడు.
Recommended