• 7 years ago
All political parties are readied to gear up for special status movement in Andhrapradesh. Though today is the last day for Parliament sessions

పార్లమెంటు మలివిడుత సమావేశాలు మొదలైన నాటి నుంచి కేంద్రానిది అదే వైఖరి. లోక్ సభలో అదే దృశ్యం మళ్లీ మళ్లీ రిపీట్. అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడం.. స్పీకర్ దాన్ని ఆమోదించకపోవడం.. దేని పైనా చర్చ జరగకుండానే సభ వాయిదా పడుతుండటం.. గత 12రోజులుగా లోక్ సభలో జరుగుతున్నది ఇదే. నేటితో లోక్ సభ సమావేశాలు ఇక క్లైమాక్స్ కు వచ్చేశాయి. ఈ ఒక్కరోజు గడిస్తే ఇక సభ నిరవధిక వాయిదానే. ఈ నేపథ్యంలో ఈరోజైనా అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశముందా?.. అంటూ 99శాతం అనుమానమే అని చెప్పాలి. అటు టీడీపీ, వైసీపీలు సైతం.. అవిశ్వాసంపై ఇక చర్చ జరగదని ఫిక్స్ అయిపోయాయి. అందుకే ఢిల్లీలోనే అమీ తుమీ తేల్చుకునేందుకు పోరు బాట పట్టబోతున్నాయి
ఉధృతం కానున్న హోదా పోరు..
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం శుక్రవారం కూడా చర్చకు రాకుండా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడినట్లయితే ఆ మరుక్షణమే తమ సభ్యత్వాలకు రాజీనామాలు ఇవ్వాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు. శుక్రవారం వీరంతా స్పీకర్‌ను కలిసి రాజీనామాలు సమర్పించనున్నారు.అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆమరణదీక్షకు దిగనున్నారు.
వైసీపీ ఎంపీలు రాజీనామాలు, దీక్షకు సిద్దమవుతుంటే.. టీడీపీ ఎంపీలు లోక్‌సభలోనే ఉండి ధర్నా చేయనున్నారు. ఈ మేరకు ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ, ఇండియా గేట్‌ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాలు చేయనున్నారు. అలాగే ప్రధాన మంత్రి అధికార నివాసం లేదా కార్యాలయం వద్ద కూడా దర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఇక ఏపీలో సీఎం చంద్రబాబు నేత్రుత్వంలో ఆ పార్టీ నేతలంతా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు శుక్రవారం ఉదయం అసెంబ్లీకి సైకిల్‌పై వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిళ్లు, మోటర్‌ సైకిల్‌ ర్యాలీల నిర్వహించనున్నారు. ఏపీకి ఇచ్చిన సమస్యలు, హామీలపై చర్చించేందుకు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలనే డిమాండుతో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది.

Category

🗞
News

Recommended