Youtube CEO Sundar Pichayya Adresses Victims Of Youtube Incident
  • 6 years ago
Few hours after the shooting happened at the San Bruno YouTube headquarters Google CEO Sundar Pichai addressed the incident and sent an email expressing disappoint on the whole incident to all the employees worldwide. In the email statement, Pichai describes the shooting as an "unimaginable tragedy" and a "horrific act of violence.

అమెరికాలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులకు పాల్పడిన నేపథ్యంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు మెయిల్ పంపించారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ట్వీట్ కూడా చేశారు.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాల్పులకు పాల్పడిన మహిళే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
కాల్పుల ఘటనతో కార్యాలయంలోని ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తం పది రౌండ్లు తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్యోగులు ప్రాణభయంతో పరుగు తీశారు. యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయంలో మొత్తం 1,700 మంది ఉద్యోగులు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. బాధితులకు సంఘీభావం తెలిపారు. సకాలంలో స్పందించిన లా అండ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న కొద్ది గంటల తర్వాత సుందర్ పిచాయ్ అక్కడ జరిగిన సంఘటనను మెయిల్ ద్వారా తెలిపారు. ఇది ఊహించని విషాదం, హింసాత్మక చర్య అని పేర్కొన్నారు.
మధ్యాహ్నం ఉద్యోగులు లంచ్ చేసే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని, లా ఎన్ఫోర్స్‌మెంట్‌తో పాటు మన సెక్యూరిటీ టీం వెంటనే స్పందించారని, ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో పెట్టుకొని భవనం నుంచి ఖాళీ చేయించారని సుందర్ పిచాయ్ మెయిల్‌లో పేర్కొన్నారు.
Recommended