మోదీ వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుంది : అమిత్ షా ట్రాన్స్‌లేటర్
  • 6 years ago
While Amit Shah addressing a BJP rally in Challkere of Karnataka's Devanagiri district where, according to the translator Prahlad Joshi's version, he said, "PM Narendra Modi will not do anything for Dalits, poor and the backward classes. He will damage the nation. Please vote for him."

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని కలలు కంటున్న బీజేపీ నేతలు చేసిన, చేస్తున్న పొరపాట్లు పతాక శీర్షికలకు ఎక్కుతూనే ఉన్నాయి. మరోసారి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలను కన్నడంలో భిన్నంగా ట్రాన్స్ లేట్ చేసిన ఘటన గురువారం జరిగింది. దవణగిరె జిల్లాలో జరిగిన సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన ప్రహ్లాద్ జోషి ఇలా తర్జుమా చేశారు. 'ప్రధాని నరేంద్రమోదీ దళితులు, పేదలు, బలహీన వర్గాల వారికి ఏమీ చేయరు. ఆయన వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుంది. దయచేసి ఆయనకు ఓటేయండి' అని అమిత్ షా అన్నారని కన్నడ భాషలో చెప్పారు.
ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడం వెనుక కఠినమైన అమిత్ షా వ్యూహం, రాజకీయ చతురత ఉన్నాయన్న సంగతి రాజకీయ విశ్లేషకులు అందరికీ తెలిసిందే. మరో అమిత్ మాల్వియా బీజేపీలో యువ నాయకుడు.. పార్టీ ఐటీ సెల్ ఇన్‌చార్జీగా అడుగడుగునా పార్టీ విధానాలను, సిద్ధాంతాలను వ్యూహాత్మకంగా యావత్ కోట్ల మంది భారతీయుల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు అమిత్ మాల్వియా.
ఇటు అమిత్ షా.. అటు అమిత్ మాల్వియా చేదోడువాదోడుగా నిలవడం వల్లే ప్రధాని నరేంద్రమోదీ అందోళనలకు అతీతంగా దేశ పాలన సాగిస్తున్నారు. కానీ ఈ అమిత్‌ల ద్వయంలో ఒకరు మాట జారారు. మరొకరు కట్టు దప్పారు. కానీ, రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాల్వియా అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తూ ‘ఫలానా తేదీల్లో పోలింగ్ జరుగుతుందని తన ట్విట్టర్ ద్వారా' లీక్ చేయడం వివాదాస్పదమైంది.
224 స్థానాల కర్ణాటక అసెంబ్లీకి మే 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన కౌంటింగ్ జరుగనున్నదని ఎన్నికల సంఘం ప్రకటించింది. తన ట్వీట్‌పై విమర్శలు హోరెత్తడంతో అమిత్ మాల్వియా, కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జి శ్రీవత్స బీ కూడా అంతకుముందే ఎన్నికల తేదీలపై తమ ట్వీట్లను తొలిగించారు. వారిద్దరూ టెలివిజన్లలో వచ్చిన వార్తల ఆధారంగా ట్వీట్లు చేశామని సమర్థించుకున్నారు.
Recommended