క్షమాపణలు చెప్పేది లేదు, సవాల్ చేస్తున్నా : బహిరంగ చర్చకు సిద్ధమా ?

  • 6 years ago
Telugudesam Party seek apology from YSR Congress Party MP Vijaya Sai Reddy for his comments on AP CM Nara Chandrababu Naidu.

సీఎం చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎట్టి పరిస్థితుల్లోను క్షమాపణలు చెప్పేది లేదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తేల్చి చెప్పారు. తమ పార్టీ అధినేతపై చేసిన వ్యాఖ్యలకు సాయి వెంటనే క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందని, అందుకే మీడియా ముందు చెప్పానని లేదన్నారు.
టీడీపీ ఎంపీలు బుధవారం పార్లమెంటు ఒకటో నెంబర్ ద్వారం వద్ద మెట్ల పైనే ఓ కేంద్రమంత్రితో మంతనాలు జరిపారని విజయసాయి విమర్శించారు. లాలూచీ రాజకీయాలు చేస్తోంది టీడీపీనే అని, తమను ఎలా అంటారన్నారు. తనను నేరగాడు అని చెప్పిన సీఎంనే తాను సవాల్ చేస్తున్నానని, ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.
జగన్ మాత్రమే ప్రత్యేక హోదా సాధించగలరని విజయసాయి చెప్పారు. ఏపీకి హోదా కోసం చంద్రబాబు యూటర్న్‌లు తీసుకోవద్దన్నారు. వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే వారం అయిదు రోజులు సమావేశాలు జరుగుతున్నాయని, అప్పుడు అవిశ్వాసం నోటీసు చర్చకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అవిశ్వాసం నోటీసు చర్చకు వచ్చేలా అన్నాడీఎంకే ఎంపీలు సహకరించడం లేదన్నారు. మాది తాగునీటి సమస్య.. మీది బతుకు సమస్య అని, బతకాలంటే ముందు తాగునీరు కావాలని, అందుకే తాము తమ సమస్య పైనే నిలబడతామన్నారు. 29న సుప్రీం కోర్టులో కావేరీ బోర్డుపై తీర్పు వస్తున్నందున అప్పుడు మీకు సహకరించడంపై ఆలోచిస్తామని చెప్పారని తెలిపారు.
ఇదిలా ఉండగా, వైసీపీ ఎంపీలు రాజీనామా లేఖలు పట్టుకుని బుధవారం పార్లమెంట్‌కు వచ్చారు. లోకసభ నిరవధిక వాయిదా పడితే వాటిని ఇద్దామనుకున్నారు. నిరవధిక వాయిదా పడకపోవడంతో రాజీనామాలు వెనక్కి తీసుకు వెళ్లారు.

Recommended