Darin Leemen Seeks Fans Support For Ball Tampering People

  • 6 years ago
బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) చర్యలు తీసుకున్న అనంతరం డారెన్ లీమన్ మీడియాతో మాట్లాడుతూ 'ఎంతోమంది అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశాం. నా మనసు లోతుల్లోంచి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నేను ఆ ముగ్గురి మానసిక పరిస్థితి గురించే (స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌) ఆందోళన చెందుతున్నాను' అని అన్నాడు.
'స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ తీవ్రమైన తప్పిదమే చేశారు. అయితే వాళ్లు చెడ్డవాళ్లు మాత్రం కాదు. అభిమానులు వారికి రెండో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను' ఈ మాటలన్నది ఎవరో కాదు ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్.
ప్రస్తుతం మేము ఆడుతున్న తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ అభిమానుల మద్దతు, అభిమానం సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ తీవ్రమైన తప్పిదమే చేశారు. అయితే వాళ్లు చెడ్డవాళ్లు మాత్రం కాదు. అభిమానులు వారికి రెండో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను' అని లీమన్ ఆసీస్ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా నిషేధం విధిస్తూ సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ బుధవారం ప్రకటన వెలువరించాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన మరో ప్రకటన డేవిడ్ వార్నర్ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలోకి నెట్టింది. నిషేధ సమయంలో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ను క్లబ్ క్రికెట్‌లోనూ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు అర్హులు కాదని పేర్కొంది. డేవిడ్ వార్నర్ మాత్రం ఎప్పటికీ కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది.

Recommended