Skip to playerSkip to main contentSkip to footer
  • 3/29/2018
Smith, specifically was guarded with at least six police officers and was led by the hand through the airport, surrounded by media and public.

కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్‌ టాంపరింగ్‌‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన స్టీవ్‌ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఇంటెగ్రెటీ హెడ్ లెయిన్ రాయ్‌తో చేపట్టిన విచారణ ముగియడం... విచారణ పూర్తయ్యే సరికి జొహన్నెస్‌బర్గ్ చేరుకున్న సీఏ సీఈఓ సదర్లాండ్ స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లకు శిక్ష ఖరారు చేయడం చకా చకా జరిగిపోయాయి.
విచారణ ముగిసిన అనంతరం స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లను తక్షణమే ఆస్ట్రేలియాకు పంపించేశారు. ఈ నేపథ్యంలో జొహానెస్‌బర్గ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న స్టీవ్ స్మిత్‌ను చూసిన అభిమానులు 'చీట్‌.. చీట్‌' అంటూ హేళన చేశారు. స్మిత్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎయిర్ పోర్ట్‌లో సాగనంపారు.
మరోపక్క మీడియా స్మిత్‌ను మాట్లాడాల్సిందిగా కోరింది. అయితే, పోలీసుల సాయంతో స్మిత్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ఆస్ట్రేలియాకు చేరుకున్న తర్వాత టాంపరింగ్ వివాదంపై గురువారం సాయంత్రం సిడ్నీలో స్మిత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నాడు

Category

🥇
Sports

Recommended