అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోతే రాజీనామా కి సిద్ధంగా ఉన్న వైసీపీ ఎంపీలు

  • 6 years ago
YSRCP President Jagan made a clear statement that their MP's will resign if no confidence motion is no taken up

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశానికి విపక్షాల మద్దతు లభిస్తుండటం.. అవిశ్వాసంపై అన్ని పార్టీలు ఒక్క తాటి పైకి వస్తుండటంతో.. బీజేపీ ఇక దాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అవిశ్వాసానికి కావాల్సిన 50మంది సభ్యుల కనీస మద్దతు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. స్పీకర్ ఇక దీన్ని తోసిపుచ్చే అవకాశం తక్కువే. ఈ నేపథ్యంలో అవిశ్వాసం చర్చకు వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీకి చెందిన ప్రధాన పార్టీలు రెండు గట్టిగానే కసరత్తు చేశాయి.
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు ఉండటంతో.. ఈ అంశంపై పార్లమెంటులో టీడీపీ తరఫున ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు మాట్లాడాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ఇద్దరిలో ఒకరు ఆంగ్లంలో, మరొకరు హిందీలో ప్రసంగించాలని స్పష్టమైన సూచన చేశారు.
విపక్షాల అవిశ్వాస తీర్మానానికి ప్రతిగా బీజేపీ విశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు. చర్చ దేనిపై జరిగినా సరే ఎంపీలంతా సిద్దంగా ఉండాలని చెప్పారు. ఏపీకి ఇచ్చిన నిధులకు సంబంధించి అమిత్ షా రాసిన లేఖలోని అవాస్తవాలను, తప్పులను మరో లేఖతో కౌంటర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ఓ లేఖను సిద్దం చేయించి టీడీపీ ఎంపీలకు పంపించే యోచనలో ఉన్నారు. ఆ లేఖ ఆధారంగా టీడీపీ ఎంపీలు బీజేపీని లోక్ సభలో కౌంటర్ చేసే అవకాశం ఉంది.
ప్రత్యేక హోదా విషయంలో ముందు నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్న వైసీపీ.. అవిశ్వాస తీర్మానం విషయంలోనూ అంతే స్పీడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా లోక్‌సభను వాయిదా వేస్తే గనుక.. వాయిదా వేసిన రోజునే తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.

Recommended