RasiKanna Gives Clarity On Affairs

  • 6 years ago
Actress Rashi Khanna said am not love with Jaspreet Bumrah. Raashi Khanna is an Indian actress and model who predominantly acts in the Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras Cafe and made her debut in Telugu with the successful Oohalu Gusagusalade.

తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్న హీరోయిన్ రాశి ఖన్నా ఇటీవల లవ్ ఎఫైర్, పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ అయింది. క్రికెట్ బూమ్రా, రాశి ఖన్నా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ వార్తల సారాంశం. ఈ వార్తలపై రాశి ఖన్నా తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో స్పందించారు.
క్రికెటర్ బుమ్రాను పెళ్లి చేసుకుంటున్నారట నిజమేనా? అని అలీ ప్రశ్నించగా... రాశి ఖన్నా స్పందిస్తూ ‘ఈ ప్రశ్న అడిగినందుకు చాలా థ్యాంక్స్‌. అతను ఒక క్రికెటర్‌ అని మాత్రమే తెలుసు. అంతకుమించి ఏమీ లేదు. అతని మ్యాచ్‌లు అస్సలు ఎప్పుడూ చూడలేదు. వ్యక్తిగా అతనెవరో కూడా తెలియదు.' అని రాశీ ఖన్నా తెలిపారు.
బూమ్రా గురించి నాపై ఈ రూమర్‌ ఎలా వచ్చాయో తెలియదు. కొన్ని హిందీ వెబ్‌సైట్‌లు చేసిన పని ఇది. ఇలాంటివి వింటుంటే చాలా చిరాగ్గా ఉంటుంది.... అని రాశీ ఖన్నా తెలిపారు.
ఒక మెగాహీరోతో కూడా లవ్‌లో ఉన్నారని అంటున్నారు.. నిజమేనా? అంటూ అలీ మరో ప్రశ్న సంధించగా.... ఎక్కడి నుంచి రాస్తారండీ ఇవన్నీ. ఎవరా హీరో మీరు చెప్పండి అంటూ అలీని ఎదురు ప్రశ్నించింది రాశీ.
సాధారణంగా హీరోయిన్లు ఒకరికొకరు ఫ్రెండ్స్‌ అవుతారు? కానీ రాశీఖన్నాకు హీరోల్లో ఎక్కువ ఫ్రెండ్స్‌ ఉన్నారట నిజమేనా? అనే ప్రశ్నకు రాశీ ఖన్నా స్పందిస్తూ.... అవును! అది నిజమే. గర్ల్స్‌.. బాయ్స్‌ ఎక్కువమందే ఉంటారు. దిల్లీలో కూడా నాకు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. రకుల్‌ నాకు చాలా క్లోజ్‌. నా సహ నటులతో చాలా క్లోజ్‌గా ఉంటాను అని సమాధానం ఇచ్చారు.

Recommended