IPL 2018: Dinesh Karthik Wanted To Play For Chennai Super Kings

  • 6 years ago
Karthik revealed that he always wanted play for Chennai Super Kings. Karthik who was born in Chennai and also represents Tamil Nadu in domestic cricket desperately wanted to be a part of the CSK.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడాలనేది తన కల అని ఐపీఎల్ 2018 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌)కు కెప్టెన్‌గా బరిలోకి దిగబోతున్న దినేశ్ కార్తీక్‌ వెల్లడించాడు. 32 ఏళ్ల కార్తీక్ 2008లో ఐపీఎల్‌ సీజన్ ప్రారంభం నుంచి వివిధ ఫ్రాంచైజీల తరుఫున ఆడుతూ వస్తున్నాడు.
కానీ ఇప్పటివరకూ తన సొంత రాష్ట్రమైన తమిళనాడు తరుఫున ఆడే అవకాశం రాలేదని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. ఐపీఎల్‌ ప్రారంభమైన తొలి సీజన్‌లో తాను చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడతానని భావించానని దినేశ్ కార్తీక్ చెప్పాడు. అయితే, పది సీజన్లు గడిచినా అది సాధ్యం కాలేదని, ఎప్పటికైనా చెన్నై తరఫున ఆడతాననే నమ్మకం ఉందని అన్నాడు.
ఐపీఎల్ 2018లో కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక అవడంపై కూడా దినేశ్ కార్తీక్ స్పందించాడు. వివిధ టోర్నీలో కెప్టెన్‌గా సమర్థవంతంగా రాణించాను. కానీ తొలిసారిగా ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చింది. కచ్చితంగా అంచనాలకు తగ్గట్టుగా జట్టును ముందుండి నడిపిస్తా' అని అన్నాడు.
కాగా, దినేశ్‌ కార్తీక్‌ ఇప్పటి వరకు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు, ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.
గత 14 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నా ఇన్నాళ్లూ రాని పేరు ప్రఖ్యాతలు దినేశ్ కార్తీక్‌కు బంగ్లాదేశ్‌తో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఫైనల్ చివరి ఓవర్ ద్వారా సంపాదించాడు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో 8 బంతుల్లో 29 పరుగులతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌లు ఆడిన దినేశ్‌ 24.81 యావరేజ్‌తో 2,903 పరుగులు సాధించాడు.

Recommended