Third Front : కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కూటమిపై శరద్ పవార్ విందు ప్రభావం

  • 6 years ago
After Congress leader Sonia Gandhi hosted a dinner for opposition parties last week, NCP chief Sharad Pawar has now invited the same parties for a dinner at his residence here on March 27, where Trinamool Congress chief Mamata Banerjee will be present. May be this will shocks kcr's Third Front

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కూడబెట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన ఆయన మరికొన్ని రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. త్వరలో కేసీఆర్ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలకు వెళ్లనున్నారు. అఖిలేష్ యాదవ్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బెంగాల్ పర్యటనపై గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివరాలు ఇచ్చారు. మరోవైపు, కేసీఆర్ థర్డ్ ఆశలకు చెక్ చెప్పేందుకు శరద్ పవార్ రంగంలోకి దిగారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు మినహాయించి 2014 నుంచి బీజేపీ దూసుకెళ్తోంది. బీజేపీ ప్రత్యేకంగా రాష్ట్రాలపై దృష్టి సారించింది. అదేవిధంగా ఉప ఎన్నికల్లో ఓటములకు తమ దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, స్థానిక పరిస్థితులు తదితర కారణాలు ఉన్నాయి. బీజేపీ దూసుకెళ్తుండటంతో దానికి అడ్డుకట్ట వేయాలని లెఫ్ట్, బీఎస్పీ, ఎస్పీ వంటి పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇందుకోసం ఎవరినైనా కలుపుకొని వెళ్లాలని కొందరు భావిస్తున్నారు. కేసీఆర్ మాత్రం నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అంటున్నారు. శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీతో జతకలిసి విపక్షాల కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సహా అనడం పవార్‌కు ప్లస్.
శరద్ పవార్ ఈ నెల 27వ తేదీన విపక్షాలకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ హాజరు కానున్నారు. 26న ఢిల్లీ వెళ్లనున్న మమత.. నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ సమయంలో ఆమె సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోను భేటీ కానున్నారని తెలుస్తోంది.
2014లో ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ - శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో బీజేపీకి అండగా నిలిచేందుకు శరద్ పవార్ ముందుకు వచ్చారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేందుకు సిద్ధమయ్యారు. జాతీయ రాజకీయాల్లో శరద్ పవార్‌కు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Recommended