దానికోసం నాన్న,బావ ఉన్నారు...!

  • 6 years ago
I never discuss politics with NTR. We discuss about films only

కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే చిత్రం ఈ శుక్రవారం మార్చి 23 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.
ఎమ్మెల్యే చిత్రంలో రాజకీయాలకు సంబందించిన అంశాలని టచ్ చేసామని కళ్యాణ్ రామ్ తెలిపారు. కానీ ఈ చిత్రం పూర్తిస్థాయి రాజకీయ కథ కాదని అన్నారు. రాజకీయ సన్నివేశాలు కూడా సరదాగా చూపించామని కళ్యాణ్ రామ్ అన్నారు.
ఎమ్మెల్యే చిత్ర దర్శకుడు ఉపేద్ర గురించి మాట్లాడుతూ.. ఉపేంద్ర రచయిత కూడా. రచయిత దర్శకుడు అయితే రెండు పేజీల డైలాగులు కూడా సింగిల్ లైన్ లోకి మారిపోతాయని అన్నారు.
ఇటీవల విడుదలైన ఎమ్మెల్యే చిత్ర ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి. నేనింకా రాజకీయం చేయడం మొదలుపెట్టలేదు. మొదలుపెడితే మీరు చేయడానికి ఇంకేం మిగలదు అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సూచన కాదని కళ్యాణ్ రామ్ అన్నారు.
తనకు ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదని కళ్యాణ్ రామ్ తెలిపారు. నటుడిగా, ప్రొడ్యూసర్ గా నేను బిజీగా ఉన్నా. ఈ సమయంలో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని కళ్యాణ్ రామ్ అన్నారు. రాజకీయాలు తన బావ చూసుకుంటారని నారా లోకేష్ గురించి వ్యాఖ్యానించారు. తన తండ్రి హరికృష్ణ కూడా రాజకీయాల్లో ఉన్నారని కళ్యాణ్ రామ్ అన్నారు.
తన సోదరుడు ఎన్టీఆర్ తో ఉన్న బంధం గురించి కూడా కళ్యాణ్ రామ్ వివరించారు. ఎన్టీఆర్ తో తాను రాజకీయాల గురించి మాట్లాడడం అస్సలు జరగదని కళ్యాణ్ రామ్ అన్నారు. తాము కేవలం సినిమాలు గురించి మాత్రమే మాట్లాడుకుంటామని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

Recommended