వైసీపీ అవిశ్వాస తీర్మాన యుద్ధం : గెలుపెవరిదో ?
  • 6 years ago
Ysrcp planned to no confidence motion on union government on March 16. Ysrcp seeking to support various parties for no confidence motion.Ysrcp wrote a letter to political parties for support its no confidence motion.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు తదితర అంశాలపై డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ మార్చి 16న, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకొంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో వైసీపీ తన వ్యూహాన్ని మార్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లో చోటు చేసుకొంటున్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగా పెట్టాలనేది వైసీపీ యోచన.
ఈ మేరకు సహకరించాలని కోరుతూ అన్ని పార్టీలకు లేఖలు రాయాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు వైసీపీ నేతలు కేంద్రంపై ప్రవేశ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వాలని ఆ లేఖలో కోరనున్నారు. టిడిపికి కూడ ఈ లేఖను పంపాలని వైసీపీ నిర్ణయించింది.
కేంద్రంపై అవిశ్వాసానికి ఏ పార్టీలు సహకారాన్ని అందిస్తాయనే విషయమై పార్లమెంట్‌లో తేలనుంది. అయితే ఇప్పటికే బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఈ అవిశ్వాసానికి సహకరిస్తాయా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అవిశ్వాసం తీర్మానంపై ఏ పార్టీల మద్దతును వైసీపీ సంపాదిస్తోందో కొన్ని గంటల్లోనే తేలనుంది.
టిడిపిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకుగాను వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టిడిపి వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కేంద్రంపై విశ్వాసం ఉందని చెబుతూనే అవిశ్వాసానికి వైసీపీ సిద్దం కావడంపై టిడిపి ఎదురుదాడికి దిగుతోంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్తితులు టిడిపిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి
Recommended