ఇంకెన్నాళ్లీ గుండాగిరీ : కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్న నేతలు

  • 6 years ago
Telangana Ministers Talasani Srinivas Yadav and Laxma Reddy and TRS leader Karne Prabhakar lashed out at Congress MLA komatireddy venkat reddy for beats Legislative Council chairman Swamy Goud.

శాసనమండలిలో ఛైర్మన్ స్వామి గౌడ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాడి చేయడంపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సమావేశాల జరుగుతున్న సమయంలో హెడ్ ఫోన్‌ను విసిరేయడంతో స్వామి గౌడ్‌ కంటికి గాయమైన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. కాగితాలు చించి గవర్నర్, స్పీకర్ పైకి విసిరేశారు. ఈ సందర్భంలోనే కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో స్వామిగౌడ్ కంటికి గాయమైంది. దీంతో ఆయనను సరోజనీ కంటి ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గుండాయిజం, రౌడీయిజం ఇంకా ఎన్ని రోజులని ప్రశ్నించారు. వారి గుండాయిజాన్ని ఇక సహించబోమని తేల్చి చెప్పారు. గత 70ఏళ్ల నుంచి అసభ్య పదజాలం, దౌర్జన్యం కొనసాగించారని.. భవిష్యత్‌లో మాత్రం వారి దౌర్జన్యాలు సాగవని అన్నారు.మండలి ఛైర్మన్‌పై దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ సిగ్గుపడాలని తలసాని అన్నారు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే ఇలాంటి చిల్లర పనులు చేయరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుల తీరును ప్రజలు చూస్తున్నారని, వారే గుణపాఠం చెబుతారని అన్నారు.

Recommended