Million March Spoorthi 2018 Updates 'మిలియన్ మార్చ్' టెన్షన్ టెన్షన్

  • 6 years ago
The Hyderabad police beefed up security massively across the city, specifically in the area around Tank Bund, as the Telangana Joint Action Committee (TJAC) has called for a 'Million March'.


2011 మార్చి 10.. 'మిలియన్ మార్చ్'తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ దినం. ఆంక్షల పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టుకుని లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ జనంతో ఆరోజు ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా.. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. ఆనాడు 'మిలియన్ మార్చ్' ధాటికి పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు. ఇంతటి నేపథ్యమున్న 'మిలియన్ మార్చ్' ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.

టీజేఏసీ చైర్మన్ కోదండరాం తలపెట్టిన 'మిలియన్ మార్చ్ స్ఫూర్తి'కి ప్రభుత్వం అనుమతినివ్వకపోవడంతో ప్రజల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేయడం గమనార్హం.

Recommended