Ye Mantram Vesave Telugu Movie Review అర్జున్‌రెడ్డి ఫెర్ఫార్మెన్స్‌ను ఆశించి వెళితే కష్టమే

  • 6 years ago
Ye Mantram Vesave is a Telugu movie starring Vijay Deverakonda and Shivani Singh in prominent roles. It is a romantic thriller directed and produced by Shridhar Marri

సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రం తర్వాత హీరో విజయ్ దేవరకొండ నటించిన ఏ మంత్రం వేసావే. వాస్తవానికి ఈ చిత్రం అర్జున్‌రెడ్డికి ముందే షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన చిత్రమిది. ఈ చిత్రం మార్చి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

నిక్కి (విజయ్ దేవరకొండ)కి కంప్యూటర్ గేమ్స్ ఆడటం అంటే పిచ్చి. బాహ్య ప్రపంచాన్ని కూడా మరిచిపోయి కంప్యూటర్స్‌లో గేమ్స్ ఆడుతుంటాడు. నిక్కీ వ్యవహారం అతని తల్లిదండ్రులకు మానసిక వ్యధకు గురిచేస్తుంది. ఇక రాగమాలిక ఆలిఅస్ రాగ్స్ (శివానీ సింగ్) కంప్యూటర్ గేమ్స్ డిజైనర్, డెవలపర్‌. ఓ కారణంగా రాగ్స్‌ని చూసి నిక్కి ప్రేమలో పడుతాడు. కానీ రాగ్స్ వెంట ఓ గ్యాంగ్ వెంటపడి దాడి చేసి బంధిస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో తన ప్రేయసిని నిక్కి ఎలా రక్షించుకొన్నాడు? రాగమాలికను ఎవరు? ఎందుకు దాడి చేశారు? నిక్కి తన ప్రేమను ఎలా గెలుచుకొన్నాడు? కంప్యూటర్ గేమ్స్ ఆడే వ్యసనం నుంచి నిక్కి ఎలా బయటపడ్డాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఏ మంత్రం వేసావే సినిమా కథ.

Recommended