Third Front : KCR to hold National Meetings
  • 6 years ago
In a country where politicians are wishy-washy about their ambitions, K Chandrashekar Rao has come clean on what he has in mind. He announced that he wishes to lead a non-BJP, non Congress Front at the Centre.
దేశ రాజకీయాల్లో మార్పు రావాలని చెబుతూ థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో అడుగు ముందుకు వేశారు. ఎవరూ ఊహించని నిర్ణయాలు ఆయన తీసుకున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లకు ధీటుగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు, ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన అనూహ్యంగా దేశవ్యాప్తంగా భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు.
రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ జాతీయస్థాయి సమావేశాలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో త్వరలో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. విడతలవారీగా ఆయా ఆధికారులతో సమావేశం కానున్నారు.

రిటైర్డ్ అధికారులు, ఆయా రాష్ట్రాల్లోని కీలక నేతలతో విడతలవారీగా సమావేశం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన, యూపీలో మాయావతి, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి వారితో భేటీ కావాలని నిర్ణయించారని తెలుస్తోంది.
Recommended