Skip to playerSkip to main contentSkip to footer
  • 3/5/2018
The Budget session of the Assembly began (monday). Governor Narasimhan speech in Andhra Pradesh Assembly.


ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, విభజన చట్టంలోని హామీలు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలు ఇంకా అమలు కావాలని గవర్నర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అమలు కావాలన్నారు. విభజనతో ఏపీ చాలా నష్టపోయిందని చెప్పారు. ఆస్తులను ప్రాంతాల వారిగా, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారని చెప్పారు.

విభజన హామీల కోసం మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నామని నరసింహన్ చెప్పారు. విభజన హామీలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. విభజన సమయంలో చట్టం చేసిన ప్రతి ఒక్కటీ అమలయ్యే వరకు తమ ప్రభుత్వం వెనుకడగు వేయదని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయంతో ఏపీకి ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ఆదాయం, ఆస్తుల పంపిణీలో హేతుబద్దత పోయిందన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఆర్థిక కేంద్రాన్ని కోల్పోయామని చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయికి వచ్చే వరకు ఏపీకి కేంద్రం సాయం చేయాలని చెప్పారు. ఏపీలో విద్యుత్ కొరత లేకుండా చూసుకున్నామని చెప్పారు.

Category

🗞
News

Recommended