Amit Shah Calls Chandrababu, YS Jagan targets Pawan Kalyan
  • 6 years ago
Amit Shah calls Naidu over Andhra issues later YSR Congress Party chief YS Jagan Mohan Reddy drag Jana Sena chief Pawan Kalyan again.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రయత్నించారు. పవన్ సలహాతోనే తాము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పారు.
ఆయన ప్రకాశం జిల్లాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం, తెలుగుదేశం పార్టీ మద్దతు, బీజేపీతో దోస్తీ తదితర అంశాలపై స్పందించారు.
ఈ నెల 21వ తేదీన మోడీ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని జగన్ మరోసారి చెప్పారు. పవన్ సూచించారని, అందుకే ఈ తీర్మానం పెడుతున్నామని చెప్పారు. అవిశ్వాసంలో టీడీపీ కూడా తమతో కలిసి రావాలని చెప్పారు. టీడీపీ ఎంపీలు మద్దతిచ్చేలా చూడాల్సిన బాధ్యత పవన్‌దే అన్నారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేకపోవడం, ప్రత్యేక హోదా బదులు ఇస్తామని చెప్పిన ప్యాకేజీ సరిగా అమలు చేయకపోవడంతో టీడీపీ, చంద్రబాబులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవసరమైతే బీజేపీతో తెగదెంపులకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.
శుక్రవారం చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీ నేతలు మాట్లాడిన తీరును చూస్తే బీజేపీతో తెగదెంపులకే సిద్ధమవుతున్నట్లుగా కనిపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రంగంలోకి దిగి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేయడం గమనార్హం.
Recommended