ఎన్టీఆర్ అలా అయ్యింది శ్రద్ధా కపూర్ కోసమా ?
- 6 years ago
A photograph that is doing rounds on social media indicates that NTR Jr has lost all the chubbiness in his face. Gone is the bloated appearance.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా కమిటైన సంగతి తెలిసిందే. గతేడాది చివర్లోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభం అయింది. అయితే ఈ సినిమాలోని పాత్ర కోసం ఎన్టీఆర్ తన లుక్ పూర్తిగా మార్చుకోవాల్సి ఉండటంతో షూటింగ్ ప్రారంభం అవ్వడానికి సమయం తీసుకుంటున్నారు. త్రివిక్రమ సూచనల మేరకు స్లిమ్ లుక్లో త్వరలో ఎన్టీఆర్ దర్శనమివ్వబోతున్నాడు.
తాజాగా ఎన్టీఆర్కు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్లో లీక్ అయింది. ఇందులో ఎన్టీఆర్ మామూలుగా ఉండాల్సిన దానికంటే చాలా సన్నగా ఉండటంతో అభిమానులు షాకవుతున్నారు.
త్రివిక్రమ్ సూచనల మేరకు ఎన్టీఆర్ చాలా సన్నబడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అభిమానులైతే... ఏంటయ్యా త్రివిక్రమ్, మా హీరోను ఏం చేయబోతున్నావ్ అంటూ.... కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా మీద ఫ్యాషన్తో ఎన్టీఆర్ ఇలా తిండి తిప్పలు మానేసి తీవ్రమైన జిమ్ వర్కౌట్లు చేస్తూ అతి తక్కువ కాలంలోనే సన్నబడుతుండటంతో, ముఖంలో కాస్త గ్లామర్ తగ్గినట్లు ఉండటంతో అభిమానుల్లో ఆందోళన, అనుమానాలు మొదలయ్యాయి.
కాగా... ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీకి టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు ‘ఆన్ సైలెంట్ మోడ్' అనే టైటిల్ పెట్టినట్టుగా పుకారు షికారు చేస్తోంది. ఈ టైటిల్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.